ముఖ్యమంత్రి జగన్ కుట్రదారు: Gorantla

ABN , First Publish Date - 2021-09-16T19:35:25+05:30 IST

ముఖ్యమంత్రి జగన్ కుట్రదారు అని టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యానించారు.

ముఖ్యమంత్రి జగన్ కుట్రదారు: Gorantla

రాజమండ్రి: ముఖ్యమంత్రి జగన్ కుట్రదారు అని టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని విచ్చినం చేస్తున్నారన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా స్పందించని గుడ్డి దర్బార్ రాష్ట్రాన్ని పరిపాలిస్తుందని మండిపడ్డారు. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు టీడీపీ రైతు ఉద్యమం వేదికవుతుందన్నారు. రైతులు పండించిన పంట కొనేనాదుడు లేడని తెలిపారు. రైతు సమస్యలను పట్టించుకోవటం లేదని విమర్శించారు. పాత బకాయిల పేరుతో రైతులపై మరింత భారం మోపుతున్నారన్నారు. ఎప్పుడో పేదలు కట్టుకున్న ఇళ్ళపై పన్నులు భారం మోపుతున్నారని తెలిపారు. రైతు ఉద్యమమే రాష్ట్ర ప్రభుత్వానికి ఉరి కాబోతోందని గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పష్టం చేశారు. 

Updated Date - 2021-09-16T19:35:25+05:30 IST