Advertisement
Advertisement
Abn logo
Advertisement

చంద్రబాబు, లోకేష్‌లను విమర్శించే స్థాయి అవినాష్‌కు లేదు: గద్దె రామ్మోహన్

విజయవాడ: ప్రభుత్వం రోడ్లపై దృష్టిపెట్టేలా టీడీపీ అనేక కార్యక్రమాలు చేపట్టిందని ఆ పార్టీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ దేవినేని అవినాష్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మండిపడ్డారు. లోకేష్ ఓడిపోయారని రాజకీయాల నుంచి తప్పుకోవాలని విమర్శిస్తున్నారన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో గెలుపోటములు సహజమని తెలిపారు. జాతీయ రాజకీయాల్లో కూడా చంద్రబాబు ప్రభావితం చేశారని అన్నారు. పీఎం, రాష్ట్రపతి ఎన్నికల్లో చంద్రబాబు కీలక పాత్ర పోషించారని చెప్పారు. చంద్రబాబు, లోకేష్‌లను విమర్శించే స్థాయి అవినాష్‌కు లేదని గద్దె రామ్మోహన్ అన్నారు. 

Advertisement
Advertisement