అమరావతి: అసెంబ్లీ వద్ద టీడీపీ అధినేత చంద్రబాబు సహా ఆ పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు నిరసన వ్యక్తం చేశారు. అసెంబ్లీకి కాలి నడకన వెళ్లిన టీడీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు... వివిధ వర్గాలపై దాడులు, అసెంబ్లీలోకి కొన్ని మీడియా సంస్థలను.. అనుమతించకపోవడంతో సంకెళ్లు, నల్ల కండువాలతో నిరసన తెలిపారు. చేతులకు సంకెళ్లు వేసుకుని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిరసన తెలిపారు.