Abn logo
Oct 28 2020 @ 09:23AM

రైతు భరోసా పేరుతో దగా: ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌

Kaakateeya

రేపల్లె(గుంటూరు): రైతు భరోసా పేరుతో జగన్‌ ప్రభుత్వం అన్నదాతలను మోసం చేస్తోందని ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పేరుతో 63లక్షల మంది రైతులకు మేలు చేకూర్చిందన్నారు. నేడు 15లక్షలకు పైగా ఉన్న కౌలు రైతుల్ని పూర్తిగా విస్మరించారాన్నరు. 50లక్షల మంది రైతులు మాత్రమే ఉన్నారని వారికి మాత్రమే రైతు భరోసా అంటూ రైతుల్ని దగా చేశారన్నారు. అటవీ హక్కులు పొందిన గిరిజనులు, రైతులు కేవలం లక్షమందే అంటూ కౌలు రైతుల్ని నిండాముంచారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.7,500 మాత్రమే ఇస్తూ కేంద్రం ఇచ్చే రూ.6వేలనుకలిపి తమ ఖాతాలో వేసుకుంటున్నారన్నారు. గతంలో రూ.1.5లక్షల రుణమాఫీని వాయిదాల్లో చేస్తారా అంటూ ప్రశ్నించి.. నేడు ఇచ్చే రూ.7,500ను మూడు వాయిదాలలో ఇస్తున్నారని రైతులు గమనించాలన్నారు. కృష్ణా గోదావరి నదులకు వరదలు వచ్చి లక్షలాది ఎకరాల్లో పంట నష్టం జరిగితే కనీసం పరామర్శించలేదని ఆయన అన్నారు. రైతులను పరామర్శించటానికి వెళ్ళే టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టటం దారుణమన్నారు.

Advertisement
Advertisement