NRI TDP మెంబర్‌షిప్ డ్రైవ్ గ్రాండ్ సక్సెస్! ఎన్నారై టీడీపీ కన్వీనర్ జయరాం కోమటికి ఘన సత్కారం!

ABN , First Publish Date - 2022-05-03T01:54:20+05:30 IST

NRI TDP మెంబర్ షిప్ డ్రైవ్ గ్రాండ్ సక్సెస్

NRI TDP మెంబర్‌షిప్ డ్రైవ్ గ్రాండ్ సక్సెస్! ఎన్నారై టీడీపీ కన్వీనర్ జయరాం కోమటికి ఘన సత్కారం!

తెలుగుదేశం పార్టీ ఎన్నారై విభాగంలో మునుపెన్నడూ చూడని కొత్త ఉత్సాహం తొణికిసలాడుతోంది. ఎన్నారై తెలుగుదేశం నూతన సమన్వయ కర్త (అమెరికా) కోమటి జయరాం, టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ సమక్షంలో, వెంకట్ కోగంటి వ్యాఖ్యాతగా ఆదివారం రాత్రి జరిగిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం విజయవంతం అయ్యింది. ఊహించిన దానికంటే పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి జనం తరలి వచ్చారు. సామాజిక అసమానతలు తొలగించే సమున్నత లక్ష్యంతో అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగే ఏకైక తెలుగు ప్రజల పార్టీ తెలుగుదేశమంటూ ఎన్నారై టీడీపీ నూతన సమన్వయ కర్త (అమెరికా) కోమటి జయరాం వ్యాఖ్యానించారు. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ మాట్లాడుతూ 2024లో ఎన్నారైలందరూ ఒక్కటై ఏపీ అభివృద్ధి కోసం చంద్రబాబు నాయకత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు. చంద్రబాబు అవసరం కొత్త రాష్ట్రానికి ఉందని ప్రజలు భావించి 2014లో ఆయనను గెలిపించారన్నారు. 2019 ఎన్నికల నాటి అబద్ధాల వల్ల తాము మోసపోయామంటూ తెలుగు ప్రజలు జరిగిన పొరపాటును గ్రహించి 2024 ఎన్నికల కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారని పట్టాభిరామ్ వ్యాఖ్యానించారు. 


కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి కొమ్మారెడ్డి, మాజీ ఎంపీ విద్య చెన్నుపాటి కుమారుడు వజీర్ చెన్నుపాటి, టొబాకో మాజీ ఛైర్మన్ సుబ్బారావు మన్నవ తదితరులు.. జయరాం కోమటిని అభినందించారు. దశాబ్దాలుగా టీడీపీతో జయరాం ప్రయాణాన్ని గుర్తుచేసిన సుబ్బారావు మన్నవ ఆయనను అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడిన జయరాం కోమటి... 2024లో తెలుగుదేశం గెలుపే ఏపీ గెలుపు అనే లక్ష్యంతో ఎన్నారైలందరినీ సమన్వయం చేసుకుని ఏకతాటిపై నడిపిస్తామన్నారు. పదవి ముళ్ల కిరీటమే, కానీ బాధ్యత మాత్రం మరువనని, ఎన్నారై టీడీపీని ఏకతాటిపై నడిపించడమే తన లక్ష్యమని అన్నారు. అనంతరం.. జయరాం కోమటి, పట్టాభిరాం, వజీర్, సుబ్బారావు మన్నవ, వెంకట్ కోగంటి తదితరులు టీడీపీ మెంబర్ షిప్ డ్రైవ్‌ను ప్రారంభించగా.. ఎన్నారైలు పెద్ద సంఖ్యలో టీడీపీ సభ్యత్వం తీసుకున్నారు. 


ఈ సందర్భంగా తెలుగుదేశం అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఎన్నారైలను ఉద్దేశించి లైవ్‌లో జూమ్ ద్వారా ప్రసంగించారు. కొత్త పదవిలో నియమితులైన జయరాం కోమటిని అభినందించారు. బే ఏరియా తెలుగుదేశం నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి టీడీపీ అధినేత మాట్లాడుతూ... ప్రతి ఒక్కరు సమిష్టిగా కృషి చేసి తెలుగుదేశం ప్రభుత్వం నెలకొల్పాలని, ఆంధ్రప్రదేశ్‌ను కాపాడుకోవడం మన బాధ్యత అని అన్నారు. కాగా.. ఎన్నారై టీడీపీ క్యాడర్లో చంద్రబాబు ప్రసంగం కొత్త ఉత్సాహం నింపింది. ఈ కార్యక్రమంలో చంద్ర గుంటుపల్లి, శ్రీకాంత్ దొడ్డపనేని, భక్త భల్ల, రజనీకాంత్ కాకర్ల, కృష్ణ గొంప, గోకుల్ మాచిరాజు, భరత్ ముప్పిరాళ్ల, విజయ ఆసూరి, ప్రసాద్ మంగిన, సతీష్ బోళ్ల, లక్ష్మణ్ పరుచూరి, గంగ కోమటి, సందీప్ ఇంటూరి తదితరులు ప్రసంగించారు. తెలుగుదేశం అధికారంలోకి రావడం సామాజిక అవసరమని, భావి తరాల భవిష్యత్తు కాపాడేది ఒక్క తెలుగుదేశం మాత్రమేనని వక్తలు ఉద్ఘాటించారు. ఊహించిన దాని కంటే అధిక సంఖ్యలో ఎన్నారైలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.



Read more