ఆంధ్రజ్యోతి- అమరావతి: విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ అభ్యర్థిని తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని కుమార్తె శ్వేతను మేయర్ అభ్యర్థిగా ప్రకటించారు. నగర నేతలు అందరి ఆమోదంతో ఆమె పేరును ప్రకటించినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.