5న ‘దళితుల ప్రతిఘటన’ మహాసభ

ABN , First Publish Date - 2021-01-24T05:40:21+05:30 IST

రాష్ట్రం లో వైసీపీ పాలనలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని, దాడులను నిరసిస్తూ ఫిబ్రవరి 5న తిరుపతిలో నిర్వహించే దళితుల ప్రతిఘటన మ హాసభను విజయవంతం చేయాలని తెలుగుదే శం పార్టీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెస్‌.రా జు పిలుపునిచ్చారు.

5న ‘దళితుల ప్రతిఘటన’ మహాసభ
సమావేశంలో మాట్లాడుతున్న అధ్యక్షుడు ఎమ్మెస్‌.రాజు, పక్కన నూకసాని, ఎరిక్షన్‌బాబు

టీడీపీ ఎస్సీసెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు రాజు 


ఒంగోలు (కార్పొరేషన్‌) జనవరి 23 : రాష్ట్రం లో వైసీపీ పాలనలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని, దాడులను నిరసిస్తూ ఫిబ్రవరి 5న తిరుపతిలో నిర్వహించే దళితుల ప్రతిఘటన మ హాసభను విజయవంతం చేయాలని తెలుగుదే శం పార్టీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెస్‌.రా జు పిలుపునిచ్చారు. శనివారం ఒంగోలు విచ్చేసి న ఆయన పార్టీ ఎస్సీ నాయకులతో సమాయత్త సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియా తో మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీలపై  ఉద్దేశపూ ర్వకంగా జరుగుతున్న దాడులపై పోలీసులు అధి కార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని ఆరోపిం చారు. చంద్రబాబునాయుడు హాయంలో రాష్ట్రం లోని దళితులు స్వర్ణయుగాన్ని చూశారని గుర్తు చేశారు.  వైసీపీ పాలనలో ఎస్సీ కార్పొరేషన్‌ను మూడు ముక్కలు చేసి,  కనీసం వాటికి చైర్మన్ల ను కూడా ఏర్పాటు చేయలేని దుస్థితిలో ఉన్నార ని చెప్పారు. ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా ఒక్క రూ పాయి కూడా రుణాలు ఇవ్వని దౌర్భాగ్య పరిస్థితి ఉందని తెలిపారు. పంచాయితీ ఎన్నికల నిర్వహ ణపై ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకులు చంద్రశేఖర్‌రెడ్డి, వెంకట్రామిరెడ్డిలు ఎన్నికల్లో పా ల్గొనలేమని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. లాక్‌డౌన్‌ సడలింపుల సమయంలో వైన్‌షాపుల వద్ద పోలీసులను, ఉపాధ్యాయులను పెట్టి మరీ మద్యం అమ్మకాలు జరిపితే అప్పుడు ఉద్యోగులు ఎందుకు ప్రశ్నించలేదన్నారు. ఎన్నికలంటే జగన్‌ ప్రభుత్వం భయపడుతోందని ఎద్దేవా చేశారు. ఎ న్నికలు సజావుగా జరగాలంటే డీజీపీ సవాంగ్‌ను విధుల నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షుడు నూకసాని బాలాజీ, రాష్ట్ర అధికార ప్రతినిధి గూ డూరి ఎరిక్షన్‌బాబు, పార్లమెంట్‌ మహిళా అధ్య క్షురాలు రావుల పద్మజ, దాసరి వెంకటేశ్వర్లు, ధ ర్నాసి బ్రహ్మానందం, గుర్రాల రాజ్‌విమల్‌, ఎద్దు శశికాంత్‌భూషణ్‌, నవూరి కుమార్‌, కసుకుర్తి అంకరాజు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-01-24T05:40:21+05:30 IST