తహసీల్దార్‌పై నాని క్యాంప్ ఆఫీస్‌లోనే దాడి: ధూళిపాళ్ల

ABN , First Publish Date - 2022-02-17T23:00:44+05:30 IST

గుడివాడ తహసీల్దార్‌పై మంత్రి కొడాలి నాని క్యాంప్ ఆఫీస్‌లోనే దాడి

తహసీల్దార్‌పై నాని క్యాంప్ ఆఫీస్‌లోనే దాడి: ధూళిపాళ్ల

అమరావతి: గుడివాడ తహసీల్దార్‌పై మంత్రి కొడాలి నాని క్యాంప్ ఆఫీస్‌లోనే దాడి జరిగిందని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. ఓ థియేటర్‌కి సంబంధించి ఎన్ఓసీ ఇవ్వలేదనే కారణంతోనే కొట్టారని ఆయన ఆరోపించారు. తప్పు చేసిన మంత్రులను శిక్షించకపోగా వారేదో ఘనకార్యం చేసినట్లుగా సీఎం వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. దళిత అధికారులపై దాడులు చేసేలా పార్టీ నేతలకు పేటెంట్ ఇచ్చినట్లుగా సీఎం తీరు ఉందని ఆయన ఎద్దేవా చేశారు. కృష్ణలంక పీఎస్‌లో ఎంపీ సురేష్‌, అనుచరులు వీరంగం సృష్టిస్తే కళ్లుండి చూడలేనట్లుగా సీఎం జగన్ ఉన్నారన్నారు. రాష్ట్రంలో జగన్‌రెడ్డి నరకాసుర పాలన సాగిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 



Updated Date - 2022-02-17T23:00:44+05:30 IST