అంగన్‌వాడీల సమస్యలను పరిష్కరించాలి: ఆచంట సునీత

ABN , First Publish Date - 2022-02-22T22:46:51+05:30 IST

రాష్ట్రంలోని అంగన్‌వాడీ సిబ్బంది ఎదుర్కొంటున్న సమసల్యను పరిష్కరించాలని

అంగన్‌వాడీల సమస్యలను పరిష్కరించాలి: ఆచంట సునీత

అమరావతి: రాష్ట్రంలోని అంగన్‌వాడీ సిబ్బంది ఎదుర్కొంటున్న సమసల్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని టీడీపీ అంగన్‌వాడీ విభాగం రాష్ట్ర ధ్యక్షురాలు ఆచంట సునీత డిమాండ్ చేశారు. కడుపుమంటతో  సిబ్బంది రాష్ట్రవ్యాప్తంగా  రోడ్డెక్కితే, వారి వెనక టీడీపీవారున్నారని తప్పుడు రాతలు రాయిస్తారా అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై ఆగ్రహంతోనే అంగన్‌వాడీలు ధర్నాలకు దిగారన్నారు. అంతేతప్ప ఎవరో చెబితే కాదనే విషయాన్ని సాక్షి దినపత్రిక గ్రహించాలన్నారు. రాష్ట్రంలోని లక్షా 20వేల మంది అంగన్‌వాడీ సిబ్బంది డిమాండ్లను పరిష్కరించాల్సిందేనని ఆమె కోరారు. అంగన్‌వాడీలకు న్యాయం చేయకపోతే తన ప్రభుత్వాన్ని తానే పతనం చేసుకున్నవాడిగా చరిత్రలో జగన్ నిలిచిపోతాడన్నారు. సిబ్బంది వేతనాన్ని రూ.4,500 నుంచి రూ.10,500లకు పెంచింది చంద్రబాబేనన్నారు. అంగన్‌వాడీ వ్యవస్థను నీరుగార్చాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మహిళాసాధికారత, స్త్రీ,శిశు సంక్షేమం ఎక్కడున్నాయో అధికార పార్టీ మహిళా ప్రజాప్రతినిధులు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. సీఎం భజన తప్ప, వైసీపీ మహిళా ప్రజాప్రతినిధులు, మహిళా మంత్రులకు  ఆడబిడ్డల కష్టసుఖాలు, కన్నీళ్లు కనిపిస్తున్నాయా అని ఆమె మండిపడ్డారు. 

Updated Date - 2022-02-22T22:46:51+05:30 IST