Advertisement
Advertisement
Abn logo
Advertisement

మంగళగిరికి తరలిన టీడీపీ నేతలు

మంగళగిరిలో చంద్రబాబు దీక్షకు సంఘీబావం తెలుపుతున్న వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల

వెంకటగిరి : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళగిరి టీడీపీ  కార్యాలయంలో నిర్వహిస్తున్న దీక్షకు సంఘీ భావం తెలిపేందుకు గురువారం మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో సుమారు 20 వాహనాల్లో నాయకులు, కార్యకర్తలు తరలివెల్లారు.  సంఘీబావం తెలిపిన వారిలో మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణతోపాటు  పట్టణ టీడీపీ అధ్యక్షుడు శ్రీరాందాస్‌ గంగాధరం, కేవీకే ప్రసాద్‌ నాయుడు, పప్పురెడ్డి చంద్ర మౌళిరెడ్డి, పోలంరెడ్డి కోటేశ్వరరెడ్డి, మస్తాన్‌నాయుడు, ఆరికట్ల శ్రీరాములు, ఏలేశ్వరం రామచంద్రయ్య నాయుడు, సిసి నాయుడు, కాపా శ్రీనివాసులు నాయుడు తదితరులు ఉన్నారు.

గూడూరు: వైసీపీ అరాచకాలను నిరసిస్తూ మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో మాజీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు గురువారం ప్రారంభించిన దీక్షల్లో  మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్‌  సంఘీభావం తెలిపారు.

రాపూరు: చంద్రబాబు చేస్తున్న పోరు దీక్షల్లో రాపూరు మండలానికి చెందిన పలువురు టీడీపీ నాయకులు పాల్గొని పోరు దీక్షల్లో పాల్గొన్నారు. 

చంద్రబాబుతో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్‌,


Advertisement
Advertisement