పశ్చిమగోదావరి: ఆర్టీసీ చార్జీల(RTC charges) పెంపును నిరసిస్తూ పాలకొల్లులో టీడీపీ(TDP) వినూత్నరీతిలో నిరసన చేపట్టింది. శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు (Nimmala ramanaidu), ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ (Angara rammohan) ఆర్టీసీ కాంప్లెక్స్‌లో బస్సులు కడిగి శుభ్రం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. పాదయాత్రలో ఒక్క రూపాయి కూడా ఛార్జీలు పెంచనన్నారని... అధికారంలోకి వచ్చాక ఆర్టీసీ చార్జీలు 3 సంవత్సరాలలో మూడు సార్లు పెంచి రూ.3 వేల కోట్ల భారం మోపారని మండిపడ్డారు. కేంద్రం డీజిల్ ధర రూ.10 తగ్గిస్తే జగన్ (Jagan) డీజిల్ సెస్ పేరుతో రివర్స్‌లో బాదుతున్నారని అన్నారు. జగన్ బాదుడులో 62 శాతం ప్రయాణం చేసే పల్లెవెలుగును వదలలేదని, చదువుకునే విద్యార్థులను కూడా వదలలేదని టీడీపీ నేతలు విమర్శలు గుప్పించారు.
ఇవి కూడా చదవండి