Abn logo
May 8 2021 @ 12:12PM

సజ్జల నీ స్థాయి నీకు తెలుసా?: టీడీపీ నేతలు

విశాఖ : నేడు టీడీపీ నేతలు పళ్ళ శ్రీనివాస్, వెలగపూడి, ఎమ్మెల్సీ దువ్వారాపు రామారావు విశాఖలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే ఈ నిరసన కార్యక్రమం చేపట్టినట్టు నేతలు చెబుతున్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. సీఎం అంటే ఉద్యోగస్తులకు జీతాలివ్వడం, సంక్షేమ పథకాలివ్వడం కాదన్నారు. సీఎంగా జగన్ ఫెయిల్ అయ్యాడన్నారు. వైఎస్ ఇంటి పేరులోనే వైరస్ ఉందని విమర్శించారు. చీము, నెత్తురుంటే జగన్ వెంటనే రాజీనామా చెయ్యాలన్నారు. చదువురాని వ్యక్తి సీఎంగా ఉన్నా ప్రజలను కాపాడేవాడన్నారు. ఇంకా టీడీపీ నేతలు మాట్లాడుతూ.. ‘‘ప్రభుత్వంలో కొందరు కుక్కల్లా చంద్రబాబు గురుంచి మొరుగుతున్నారు. సజ్జల నీ స్థాయి నీకు తెలుసా? జగన్ సీఎం కాకపోతే నువ్వు దేనికి పనికిరావు. పక్క రాష్ట్రాలనైనా చూసి నేర్చుకోవాలి. నువ్విచ్చే పథకాలు తీసుకోవడానికి ప్రజలు బ్రతికుండాలి కదా.. ఇష్టానుసారంగా మాట్లాడితే ప్రజలు రాళ్లతో కొడతారు. రోగులకు బెడ్‌లు ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది’’అని విమర్శించారు.


Advertisement
Advertisement
Advertisement