పోతవరంలో టీడీపీ ఫ్లెక్సీ చించివేతపై ఆందోళన

ABN , First Publish Date - 2021-02-27T04:52:17+05:30 IST

పోతవరం గ్రామంలో టీడీపీ ఫ్లెక్సీని వైసీపీ నాయకుడు చించివేశాడు.

పోతవరంలో టీడీపీ ఫ్లెక్సీ చించివేతపై ఆందోళన
పోతవరం సొసైటీ రోడ్డుపై టీడీపీ నాయకుల ఆందోళన

నల్లజర్ల, ఫిబ్రవరి 26 : పోతవరం గ్రామంలో టీడీపీ ఫ్లెక్సీని వైసీపీ నాయకుడు చించివేశాడు. దీనిపై టీడీపీ శ్రేణులు శుక్రవారం ఆందోళనకు దిగారు. సొసైటీ కార్యాలయంలో పనిచేస్తున్న వైసీపీ నాయకులు ఫ్లెక్సీ చింపినట్టు టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. టీడీపీ శ్రేణులు అధిక సంఖ్యలో సొసైటీ రోడ్డుపైకి రావడంతో ఆందోళన తీవ్రమైంది. ఎస్‌ఐ చంద్రశేఖర్‌ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపుచేశారు.

Updated Date - 2021-02-27T04:52:17+05:30 IST