దేవరపల్లి, జనవరి 25: సుప్రీం తీర్పు ప్రజాస్వామ్య విజయమని నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి జగన్ రాజీనామా చేయాలని మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. దేవరపల్లిలో తన ఇంటివద్ద జరిగిన సమావేశంలో ముప్పిడి మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికలపై సుప్రీంతీర్పు వైసీపీ ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోందని ఆరోపించారు.