Advertisement
Advertisement
Abn logo
Advertisement

‘చంద్రబాబు శపథాన్ని నెరవేరుద్దాం’

ప్యాపిలి, డిసెంబరు 5: అసెంబ్లీలో చంద్రబాబు శపథాన్ని నెరవేర్చడానికి ప్రతి టీడీపీ కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వై.నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ప్యాపిలిలోని టీడీపీ కార్యాలయంలో ఆదివారం ఆయన పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. నాగేశ్వరరావు యాదవ్‌ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం పూర్తిగా ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని, వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రభుత్వ తీరును ఎండగట్టాలని సూచించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆర్‌ఈ నాగరాజు, గౌతంరెడ్డి, ఎర్రగుంట్లపల్లి వెంకటేశ్వరరెడ్డి, గండికోట సుబ్బయ్య, అలేబాదు పరమేష్‌, రామ్మోహన్‌యాదవ్‌, చిన్నసుంకయ్య, వెంకటరమణచారి, కాంతారెడ్డి, మాధవరం స్వామి, ఘనమద్దయ్య, కలచట్ల ప్రసాద్‌, రమణగౌడు, సలామ్‌, హనుమప్ప, సందీప్‌, సురేంద్ర, ఆదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement