లక్ష్మణేశ్వరంలో కరపత్రాలు పంచుతున్న టీడీపీ నేతలు
నరసాపురం రూరల్, జూలై 1: అమ్మఒడి సొమ్ములు ఇచ్చి రెండు రోజులు గడవకుండానే ఆర్టీసీ చార్జీలతో ప్రభుత్వం ప్రజలను బాదేసిందని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పొత్తూరి రామరాజు విమర్శించారు. మండలంలోని లక్ష్మణేశ్వరం, పట్టణంలోని 7 వార్డుల్లో శుక్రవారం బాదుడే బాదుడు పేరిట ప్రభుత్వ బాదుడు తీరును ప్రజలకు వివరించారు. ఇంటింటికి వెళ్లి కరప త్రాలు అందించారు. ఆర్టీసీ చార్జీలు పెంచి రెండున్నర నెలలు గడవకుండానే మరోసారి పెంచిన ఘనత జగన్‌కే దక్కుతుందన్నారు. ప్రతి పథకానికి ప్రజ లను ఒక బాదు బాదడం వైసీపీ ప్రభుత్వానికే చెల్లిందన్నారు. సామాన్య, మధ్య తరగతి ప్రజలకు పూట గడవడమే కష్టంగా ఉన్న తరుణంలో ప్రభు త్వం ఇలా భారాలు మోపడం దారుణమన్నారు. ఎంపీటీసీ హరికృష్ణ, వాతా డి ఉమా, కడలి మోహన్, మురళీ, పద్మారావు, జక్కం శ్రీమన్నారాయణ, టి లక్ష్మినారాయణ, సంకు భాస్కర్, మల్లాడి మూర్తి తదితరులు పాల్గొన్నారు.
చార్జీల భారంపై పెనుగొండ మండలం దేవలో నేతల ప్రచారం పెనుగొండ: మండలంలోని దేవ గ్రామంలో టీడీపీ నేతలు బాదుడే బాదుడు పేరిట చార్జీల భారాన్ని ప్రజలకు వివరించారు. సామాన్యుల ఇబ్బందులు పట్టించుకోకుండా వైసీపీ నాయకులు, మంత్రులు పర్యటనలు చేస్తున్నారన్నారు. రోజు రోజుకు నిత్యావసర ధరలు పెరుగుతున్నప్పటికి పట్టించుకోకుండా మాయమాటలతో పబ్బం గడుపుతున్నారని, వారికి ప్రజలే తగిన గుణపాఠం చెప్పాలన్నారు. టీడీపీ మండల అధ్యక్షుడు వెలిచేటి బాబూరాజేంద్రప్రసాద్, గంధం వెంకట్రాజు పలువురు నాయకులు ఉన్నారు.