బాదుడు ప్రభుత్వానికి ఓటుతో బుద్ధి చెప్పాలి

ABN , First Publish Date - 2022-07-06T03:17:35+05:30 IST

రాష్ట్రంలో బాదుడు ప్రభుత్వానికి ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ మాలేపాటి సుబ్బానాయుడు పిలుపునిచ్చారు.

బాదుడు ప్రభుత్వానికి ఓటుతో బుద్ధి చెప్పాలి
ట్రంకురోడ్డులో ధర్నా చేస్తున్న మాలేపాటి, టీడీపీ నేతలు

ఆర్టీసీ చార్జీలు పెంపును నిరసిస్తు టీడీపీ ధర్నా

కావలిటౌన్‌, జూలై 5: రాష్ట్రంలో బాదుడు ప్రభుత్వానికి ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ మాలేపాటి సుబ్బానాయుడు పిలుపునిచ్చారు. ఆర్టీసీ చార్జీల పెంపును నిరసిస్తు మంగళవారం ట్రంకురోడ్డు ఆర్టీసీ కూడలిలో టీడీపీ శ్రేణులు ధర్నా చేశారు. ముందుగా పార్టీ కార్యాలయం నుంచి ఆర్టీసీ డిపో వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాలేపాటి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం మూడేళ్లలో మూడు సార్లు చార్జీలు పెంచిందన్నారు. రాష్ట్రంలో జగనన్న బాదుడే బాదుడు పఽథకం విజయవంతంగా కొనసాగుతుందన్నారు. ఆర్టీసీ, విద్యుత్‌ చార్జీలతోపాటు నిత్యావసర సరుకుల ధరలు మూడు రెట్లు పెరిగాయన్నారు. వైసీపీ చెత్త పాలనలో చివరకు చెత్త పన్ను కూడా వసూలు చేస్తూ ప్రజలను దోపిడీ చేస్తున్నారన్నారు. సీఎం జగన్‌ ప్రజలపట్ల కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని, ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే కేసులు పెట్టి భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని, చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం గాడిలో పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, జిల్లా కార్యదర్శి మన్నవ రవిచంద్ర, రాష్ట్ర నేతలు మొగిలి కల్లయ్య, ఆత్మకూరి నాగరాజు, తటవర్తి వాసు, జిల్లా నేతలు ఏగూరి చంద్రశేఖర్‌, దావులూరి దేవ, శానం హరి, అబ్దుల్‌ రహీం, చవల రామకృష్ణ, కావేటి చినకోటయ్య, రఫి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-06T03:17:35+05:30 IST