బస్‌ చార్జీల పెంపు దారుణం

ABN , First Publish Date - 2022-07-02T06:38:04+05:30 IST

సీఎం జగన్‌ అధికారంలోకి వచ్చాక ఇప్పటికే మూడు విడతలుగా ఆర్టీసీ చార్జీలు పెంచడం దారుణమని చింతలపూడి మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీరామకృష్ణ విమర్శించారు.

బస్‌ చార్జీల పెంపు దారుణం
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న టీడీపీ నాయకులు

కామవరపుకోట, జూలై 1 : సీఎం జగన్‌ అధికారంలోకి వచ్చాక ఇప్పటికే మూడు విడతలుగా ఆర్టీసీ చార్జీలు పెంచడం దారుణమని చింతలపూడి మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీరామకృష్ణ విమర్శించారు. శుక్రవారం పాతూరులోని ఆయన నివాసం వద్ద విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జగన్‌ వచ్చిన అనంతరం మొదటిసారిగా రూ. 675 కోట్లు, రెండోసారి రూ.1500 కోట్లు, మూడోసారి రూ.2175 కోట్ల భారాన్ని ప్రయాణికులపై మోపారన్నారు. 2018 జనవరి 5వ తేదీన చిత్తూరు జిల్లాలో ఆర్టీసీ విలీనం చేస్తానని ప్రకటించి, ఆర్టీసీని విలీనం చేయకుండా ఉద్యోగులను మాత్రమే తీసుకుని వారికి అంతకుముందు వచ్చే సదుపాయాలను రాకుండా  అన్యా యం చేశారన్నారు. టీడీపీ మండల అధ్యక్షుడు కిలారు సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా బస్సు డిపోల్లోని ఖాళీ స్థలాలను జీవోటీ  పేరుతో 33 ఏళ్ల లీజుకు ఇచ్చే క్రమంలో వైసీపీ నేతలు తక్కువ లీజుకు స్వాధీనం చేసుకుంటున్నారని విమర్శించారు. మాజీ జడ్పీటీసీ ఘంటా సుధీర్‌బాబు, టీడీపీ ఏలూరు పార్లమెంటు ఎస్సీ సెల్‌ కార్యదర్శి కొయ్యగూర వెంకటేష్‌, టీడీపీ నాయకులు పర్సా శ్రీనివాసరావు, కంచర్ల సత్యంబాబు తదితరులు ఉన్నారు.

Updated Date - 2022-07-02T06:38:04+05:30 IST