-
-
Home » Andhra Pradesh » TDP leaders Chandrababu-MRGS-AndhraPradesh
-
అక్రమ కేసులతో టీడీపీ నేతలను అరెస్ట్ చేస్తున్నారు: Chandrababu
ABN , First Publish Date - 2022-05-12T02:22:55+05:30 IST
అక్రమ కేసులతో టీడీపీ నేతలను అరెస్ట్ చేస్తున్నారని ఆ పార్టీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ
చిత్తూరు: అక్రమ కేసులతో టీడీపీ నేతలను అరెస్ట్ చేస్తున్నారని ఆ పార్టీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మాజీమంత్రి నారాయణ ఏం తప్పు చేశారని అరెస్ట్ చేశారు? అని ప్రశ్నించారు. టీడీపీని రాజకీయంగా దెబ్బ తీసేందుకే అక్రమ అరెస్ట్‌లు చేస్తున్నారని తెలిపారు. టీడీపీ నేతలను అరెస్ట్ చేసి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఇన్నర్ రింగ్‌రోడ్డు అంశంలో తనపై తప్పుడు కేసు పెట్టారని, తప్పుడు కేసులు పెట్టుకుంటూ పోతే సీఎం జగన్ జీవితాంతం జైళ్లలోనే ఉంటారని హెచ్చరించారు. కుప్పంలో వైసీపీ దొంగలు పడ్డారని, అన్నింటిని దోచుకుంటున్నారని ఆరోపించారు. కొత్తగా అక్రమ బియ్యం రవాణా వ్యాపారం మొదలుపెట్టారని చంద్రబాబు ఆరోపించారు.