కాలవ అరెస్టుపై టీడీపీ నాయకుల ఆగ్రహం

ABN , First Publish Date - 2022-05-22T06:48:31+05:30 IST

టీడీపీ జిల్లా అధ్యక్షుడు కాలవ శ్రీనివాసులు అరెస్ట్‌పై టీడీపీ మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాలవ అరెస్టుపై టీడీపీ నాయకుల ఆగ్రహం
మాజీ మంత్రి కాలవతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కేశవ్‌

అడ్డుకోవడం తగదు

తాడిపత్రి, మే 21:  టీడీపీ జిల్లా అధ్యక్షుడు కాలవ శ్రీనివాసులు అరెస్ట్‌పై టీడీపీ మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీ వెంకటేశ్వరస్వామి కల్యాణంలో జరిగిన తప్పిదాన్ని బహిర్గతం చేసేందుకు రాయదుర్గం వెళుతున్న ఆయనను పోలీసులు మార్గమధ్యలో అడ్డుకొని అరెస్ట్‌ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అధికార పార్టీ అరాచకా లకు ఈ అరెస్ట్‌ అద్దం పడుతోందని తెలిపారు.

పయ్యావుల పరామర్శ

ఉరవకొండ: ప్రభుత్వం పోలీసుల ద్వారా టీడీపీ నేతలను అడ్డుకోవడం సరికాదని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ పేర్కొన్నారు. అనంతపురంలో హౌస్‌ అరెస్ట్‌లో ఉన్న మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు శనివారం పరామర్శిం చారు. అనంతరం ఆయన పోలీసుల తీరుపై ఎమ్మెల్యే ఆందోళన వ్యక్తం చేశా రు. తప్పు జరగకపోతే కాలువను ఎందుకు దేవాలయం వద్దకు వెళ్లేం దుకు అనుమతించలేదని ప్రశ్నించారు.  

వడ్డుపల్లి టోల్‌ప్లాజా వద్ద రాస్తారోకో

 కళ్యాణదుర్గం: వాస్తవాలను నిర్ధారించుకునేందుకు వెళుతున్న  మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులను అరెస్ట్‌ చేయడం అప్రజాస్వామికమని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి కరణం రామ్మోహన్‌చౌదరి, మారుతిచౌదరి,  పార్లమెంట్‌ ఉపాధ్యక్షులు వైపీరమేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మాజీ మంత్రి కాలవ అరెస్ట్‌ను నిరసిస్తూ వడ్డుపల్లి టోల్‌ప్లాజా వద్ద  స్థానిక నాయకులతో కలిసి రాస్తారోకో చేపట్టారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్‌చేశారు. అనంతరం కాలవ స్వగృహానికి వెళ్లి పరామర్శించారు. కార్యక్రమంలో నాయకులు పాపంల్లి రామాంజనేయులు, గౌని శ్రీనివాసరెడ్డి, ఊటంకి రామాంజనేయులు, ఒంటిమిద్ది సత్తి, హనుమంతరెడ్డి, వెలుగులోకేష్‌, సర్పం చు లాల్‌కృష్ణ, మోరేపల్లిరాము, రజనీకాంత్‌, శ్రీనివాసులు, గంగడిరెడ్డి, మహే ష్‌, శివకుమార్‌, వన్నూరుస్వామి పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-22T06:48:31+05:30 IST