ఎన్టీఆర్‌ పేరు ఉంచాల్సిందే..

ABN , First Publish Date - 2022-09-29T05:07:17+05:30 IST

హెల్త్‌ యూనివర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు కుట్రపూరితంగా తొలగించారని, పేరు ఉంచాల్సిందేనని టీడీపీ జిల్లా అధ్యక్షు రాలు తోట సీతారామలక్ష్మి డిమాండ్‌ చేశారు.

ఎన్టీఆర్‌ పేరు ఉంచాల్సిందే..
రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న టీడీపీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి

టీడీపీ జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి డిమాండ్‌


భీమవరం అర్బన్‌, సెప్టెంబరు 28: హెల్త్‌ యూనివర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు కుట్రపూరితంగా తొలగించారని, పేరు ఉంచాల్సిందేనని టీడీపీ జిల్లా అధ్యక్షు రాలు తోట సీతారామలక్ష్మి డిమాండ్‌ చేశారు. భీమవరం నియోజకవర్గ టీడీపీ ఆధ్వర్యంలో బుధవారం ఎన్‌టీఆర్‌ విగ్రహం వద్ద రీలే నిరాహార దీక్ష చేపట్టారు. సీతారామలక్ష్మి మాట్లాడుతూ తుగ్లక్‌ ముఖ్యమంత్రి అర్ధరాత్రి క్యాబినెట్‌ మీటింగ్‌ ద్వారా అసెంబ్లీలో ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరును మారుస్తూ నిర్ణయం తీసుకోవడంపై మండిపడ్డారు. యూనివర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు పెట్టే వరకు దీక్షలు కొనసాగిస్తామన్నారు. పార్టీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి మాట్లాడుతూ ఆనాడు ఎన్‌టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీలో 400 కోట్లు కొట్టేసి, తన తండ్రి పేరును ముఖ్యంత్రి జగన్‌ ఏకపక్షంగా మా ర్పుచేయడం మరింత అవినీతి చేయడమేనన్నారు. కోళ్ళ నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎన్టీఆర్‌ పేరును తొలగించడం ముఖ్యమంత్రి జగన్‌ దుర్మార్గపు చర్య అన్నారు. పార్టీ మండల అధ్యక్ష కార్యదర్శులు రేవు వెంకన్న, కౌరు పృథ్వీశంకర్‌, వీరవాసరం నాయకులు కోలేపర శ్రీనివాస్‌, వీరవల్లి శ్రీనివాస్‌, గునుపూడి తిరుపాల్‌, ఎద్దు ఏసుపాదం, చెల్లబోయిన సుబ్బారావు, బోల్లంపల్లి ప్రసాదు, నల్లం గంగాధర్‌, బోక్కా సూరిబాబు, ములుగుర్తి శివాని, మద్దుల రాము, ఉప్పులూరి చంద్రశేఖర్‌, తదితర నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-09-29T05:07:17+05:30 IST