ప్రభుత్వ తీరుతో ఇబ్బందుల్లో ప్రజలు

ABN , First Publish Date - 2020-10-24T10:27:58+05:30 IST

రాష్ట్రంలో ప్రభుత్వమే ప్రజలను ఇబ్బందులు పెడుతోందని టీడీపీ నాయకులు తెలిపారు. ప్రజలకు సమస్య వస్తే ప్రభుత్వం వైపు చూస్తారని..

ప్రభుత్వ తీరుతో ఇబ్బందుల్లో ప్రజలు

 విర్రవిగితే వడ్డీసహా బదులు తీర్చుకుంటాం

కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో టీడీపీ నాయకులు


గుంటూరు, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రభుత్వమే ప్రజలను ఇబ్బందులు పెడుతోందని టీడీపీ నాయకులు తెలిపారు. ప్రజలకు సమస్య వస్తే ప్రభుత్వం వైపు చూస్తారని.. కానీ దురదృష్టవ శాత్తు రాష్ట్రంలో ప్రభుత్వమే సమస్యగా మారిందన్నారు. టీడీపీ కార్య వర్గ నాయకుల ప్రమాణ స్వీకారోత్సవం శుక్రవారం స్థానిక పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగింది.  గుంటూరు పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షుడిగా తెనాలి శ్రావణ్‌కుమార్‌, మహిళా విభాగం అధ్యక్షురాలిగా అన్నాబత్తుని జయలక్ష్మి, ప్రధాన కార్యదర్శిగా రిజ్వానా ప్రమాణ స్వీకారం చేశారు. తొలుత నేతలు లాడ్జిసెంటర్‌ వరకు ప్రదర్శన నిర్వహించి అంబేద్కర్‌ విగ్రహానికి, పార్టీ కార్యాలయలో ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో ఎంపీ గల్లా జయదేవ్‌ మాట్లాడుతూ 2022లో ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని తెలిపారు.


కేసులున్న ప్రజాప్రతినిధులపై విచారణ వేగవంతంచేయడంతో జగన్‌లో ఆందో ళన నెలకొందని, జైలుకు వెళ్లినా ప్రజల సానుభూతి పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. శ్రావణ్‌కుమార్‌ మాట్లాడుతూ మళ్లీ అధికారంలోకి రావడానికి, చంద్రబాబుకు అండగా నిలవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ అధికారం ఉందని వైసీపీ శ్రేణులు టీడీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలో వచ్చాక అంతకంత వడ్డీసహా బదులు తీర్చుకుంటామని హెచ్చరించారు. వైసీపీ ప్రభుత్వ నియంతృత్వ పోకడలకు ప్రజలు బుద్ధిచెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ దళితుడిని పార్టీ పార్లమెంట్‌ అధ్యక్షు డిగా చేసిన ఘనత టీడీపీదేన్నారు.


కార్యక్రమంలో పార్టీ ఇన్‌చార్జి డాక్టర్‌ నాయుడు, మాజీ ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌, జీవీ ఆంజనేయులు, మాజీ మంత్రి డాక్టర్‌ మాకినేని పెదరత్తయ్య, డాక్టర్‌ రాయపాటి శ్రీనివాస్‌, మహ్మద్‌ నసీర్‌, కోవెలమూడి రవీంద్ర, మద్దిరాల జోసఫ్‌ ఇమ్యానియల్‌, దాసరిరాజామస్టారు, డేగల ప్రభాకర్‌, మాను కొండ శివప్రసాద్‌, ధారునాయక్‌, వేగేశన నరేంద్రవర్మ, కంచర్ల శివరామయ్య, పిల్లి మాణిక్యరావు, సినీనటి దివ్యవాణి, మన్నవ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. పొలిట్‌ బ్యూరో సభ్యులుగా నియమితులైన ఆనందబాబు, జయదేవ్‌, జాతీయ అధికార ప్రతినిధిగా నియమితుడైన మహ్మద్‌ నసీర్‌లను పార్టీ నేతలు సత్కరించారు. 

Updated Date - 2020-10-24T10:27:58+05:30 IST