విజయవాడ: కేసుల భయంతో రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని సీఎం జగన్ మోహన్ రెడ్డి(Jagan mohan reddy)పై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు(Yanamala ramakrishnudu) విరుచుకుపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. జీఎస్టీ నష్టపరిహారంలో నష్టపోయేలా కేంద్రానికి మద్దతు ఇవ్వడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. జీఎస్టీ కౌన్సిల్‌లో ప్రజలపై భారాలు మోపుతున్నా నోరు మెదపరా అని నిలదీశారు. జీఎస్టీ నష్టపరిహారం మరో ఐదేళ్ల పాటు పొడింగించాలని అన్ని రాష్ట్రాలు అడిగితే..ఏపీ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉందని మండిపడ్డారు. పుదుచ్చేరి, జార్ఖండ్ లాంటి రాష్ట్రాలు కూడా కేంద్రాన్ని ప్రశ్నించాయన్నారు. జగన్ రెడ్డి మాత్రం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టారని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి