అమరావతి: వ్యవస్థలను దోచేసిన వ్యక్తి లంచాలు తీసుకోవడం నేరమని మాట్లాడటం ఈ శతాబ్దపు అతిపెద్ద జోక్ అని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు(Yanamala ramakrishnudu) అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ రెడ్డి(Jagan reddy) సామాజిక న్యాయం మాటలకే పరిమితమైందని మండిపడ్డారు. మూడేళ్లలో విద్యారంగం పతనావస్థకు చేరుకుందన్నారు. అమ్మఒడి ఇవ్వకపోవడంతో కాలేజీల్లో అడ్మిషన్లు ఇవ్వడం లేదని, పిల్లల భవిష్యత్తు నాశనం అవుతోందని ఆందోళన చెందారు. ప్రజల వినిమయ వ్యయం పూర్తిగా పడిపోయిందని తెలిపారు. దావోస్ పర్యటనతో ఒరగబెట్టింది ఏంటో చెప్పకుండా లంచం అంశంతో ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి