Abn logo
May 23 2020 @ 11:29AM

ఎంపీ నందిగం సురేష్‌ను సుప్త అవస్థలో పెట్టాలి: వర్ల

అమరావతి: హైకోర్టు తీర్పులు చంద్రబాబుకు ముందుగానే తెలుస్తున్నాయంటూ బాపట్ల ఎంపీ నందిగం సురేష్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత వర్ల రామయ్య తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎంపీ నందిగం సురేష్ అవగాహనారాహిత్యంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ ఎవరో మాట్లాడమంటే అవగాహనలేమితో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారశైలిపై ఇతర రాష్ట్రాల వారు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారన్నారు. హైకోర్టును చంద్రబాబు మేనేజ్ చేశారని బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని మండిపడ్డారు. ఏపీ హైకోర్టులో ఇచ్చే తీర్పులన్నీ చంద్రబాబు గారికి 10 నిమిషాల ముందు వస్తాయని నందిగం సురేష్ మాట్లాడటం కోర్టు ధిక్కారం కాదా అని ప్రశ్నించారు. న్యాయస్థానాలను కించపరుస్తున్నారన్నారు.


‘‘హైకోర్టు మేనేజ్ బుల్ అని మీరు చెబుతున్నారా?...మీ లాంటి వ్యక్తులను పార్లమెంట్‌కు పంపామని ప్రజలందరూ తలదించుకుంటున్నారు. నందిగం సురేష్ ఏమైనా ఆలోచన ఉందా అని... విద్యాబుద్ధులు నేర్చుకున్నారా అని నిలదీశారు. న్యూస్ పేపర్ కూడా చదవలేరని బయటవారు చెబుతున్నారు’’ అని వ్యాఖ్యానించారు. వ్యక్తిగత విమర్శల జోలికి తాను పోవడం లేదన్నారు. హైకోర్టును కామెంట్ చేయడం చాలా గర్హనీయమని మండిపడ్డారు. హైకోర్టును కించపరుస్తూ కామెంట్ చేసిన ఎంపీ నందిగం సురేష్‌పై కంటెమ్ట్ ఆఫ్ ది కోర్టు కేసు రిజిస్టర్ చేయాలని చీఫ్ జస్టిస్ ఆదేశించాలని.. చట్టబద్ధంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఎంపీ వ్యాఖ్యలపై హైకోర్టు తక్షణమే స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. ఎంపీ అయినంత మాత్రానా కోర్టులను, న్యాయమూర్తులను కించపరచాలని లేదని... ఇలాంటి వ్యక్తి పార్లమెంట్‌లో అడుగుపెడితే ఇష్టారాజ్యంగా మాట్లాడతారని వ్యాఖ్యానించారు. జగన్ చెప్పిందే రాజ్యాంగం అనే ప్రమాదం ఉందన్నారు. ఎంపీ నందిగం సురేష్ కేసు తేలేంత వరకు ఆయనను సుప్త అవస్థలో పెట్టాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు. 

Advertisement

ఆంధ్రప్రదేశ్ మరిన్ని...

Advertisement
Advertisement