ఎస్‌ఈసీతో సమావేశంపై నిరసన తెలుపుతాం: వర్ల రామయ్య

ABN , First Publish Date - 2021-03-01T17:38:45+05:30 IST

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఒక మొక్కుబడి మీటింగ్ పెట్టినట్టు అర్థమవుతోందని టీడీపీ నేత వర్ల రామయ్య విమర్శించారు.

ఎస్‌ఈసీతో సమావేశంపై నిరసన తెలుపుతాం:  వర్ల రామయ్య

విజయవాడ: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఒక మొక్కుబడి మీటింగ్ పెట్టినట్టు అర్థమవుతోందని టీడీపీ నేత వర్ల రామయ్య విమర్శించారు. సోమవారం ఉదయం ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌తో వివిధ పార్టీల నేతల సమావేశం ముగిసింది. అనంతరం వర్ల రామయ్య మీడియాతో మాట్లాడుతూ సమస్యలు చెప్పండి పరిష్కరిస్తామని పిలిచి 5 నిముషాలు సమయం ఇస్తారా? అని ప్రశ్నించారు. ప్రధాన ప్రతిపక్షానికి 5 నిముషాలు టైం ఇస్తారా అని మండిపడ్డారు. నాలుగు పంచాయతీ ఎన్నికలలో జరిగిన అవకతవకలు గురించి చెప్పొద్దా అని నిలదీశారు. డబుల్ డిజిట్‌లో గెలుపు ఉంటే రీకౌంటింగ్ వద్దన్నారు ఎందుకు చేశారు అని అడిగామన్నారు. పంచాయతీ ఎన్నికల ముందు ఉన్న నిమ్మగడ్డ వేరు ఇప్పుడు ఉన్న వారు వేరని తెలిపారు. కౌంటింగ్ సెంటర్‌లకు వచ్చి పోలీసులు విజయాపజయలు నిర్ధారిస్తున్నారన్నారు. ఎస్‌ఈసీ ఇలా ఉంటే న్యాయం జరుగుతుంది అని తాను భావించడం లేదని చెప్పారు. నిమ్మగడ్డ భయపడ్డారు అని తాను అనడం లేదని... ఆయనలో మార్పు వచ్చిందని అంటున్నానని తెలిపారు. ఎన్నికల కమిషనర్ తమ మాట వినడానికి పిలవలేదని విమర్శించారు.  ఎస్‌ఈసీ మీటింగ్ నిర్వహించిన తీరు పట్ల నిరసన తెలియజేస్తున్నామని వర్ల రామయ్య తెలిపారు. 

Updated Date - 2021-03-01T17:38:45+05:30 IST