Abn logo
Nov 25 2020 @ 12:24PM

జగన్ గారూ...మీరు నమ్మేది ఎవరిని?: వర్ల

అమరావతి: రాష్ట్రంలో న్యాయస్థానం, ఎన్నికల కమిషన్‌కు వ్యతిరేకంగా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై టీడీపీ నేత వర్ల రామయ్య తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ట్విట్టర్ వేదిగా స్పందిస్తూ...‘‘ముఖ్యమంత్రి గారూ! మీరెందుకు వ్యవస్థలను నమ్మడం లేదు. న్యాయ వ్యవస్థను నమ్మరు, ఎన్నికల కమిషన్‌ను నమ్మరు, రాష్ట్ర పోలీసుల మీద నమ్మకం లేదంటారు, కేంద్రంతో కుదరదంటారు, మరి, మీరు నమ్మేదెవరిని? అసలు, ఇన్ని, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మిమ్ములను ఎందుకు ప్రజలు నమ్మాలి? గ్రహచారం కాకపోతే!’’ అంటూ వర్ల రామయ్య ట్వీట్ చేశారు.  


Advertisement
Advertisement
Advertisement