కృష్ణా: ఏపీ మంత్రి కొడాలి నానిపై టీడీపీ నేత వర్ల రామయ్య విమర్శలు గుప్పించారు. కొడాలి నాని ఆధ్వర్యంలో విష సంస్కృతిని తీసుకొచ్చారని వర్ల మండిపడ్డారు. కొడాలి నాని అసమర్థ నేత అని టీడీపీ నేత వర్ల రామయ్య అన్నారు. గుడివాడ కేసినో వ్యవహారం పోలీసులకు తెలియదా? అని వర్ల రామయ్య ప్రశ్నించారు. టీడీపీ నేతలపై వైసీపీ రౌడీమూకలు దాడిచేస్తుంటే.. పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారని వర్ల రామయ్య విమర్శించారు. ఘటనపై శనివారం ఏలూరు డీఐజీకి ఫిర్యాదు చేస్తామని వర్ల రామయ్య తెలిపారు.
ఇవి కూడా చదవండి