‘డీజీపీ గారూ..మీ నాయకత్వంలో పోలీస్ వ్యవస్థ మసక బారుతోంది’

ABN , First Publish Date - 2021-01-21T16:52:33+05:30 IST

టీడీపీ నేత కళా వెంకట్రావ్ అరెస్ట్‌పై టీడీపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ విషయంలో పోలీసులు, డీజీపీ తీరుపై టీడీపీ నేత వర్ల రామయ్య ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు.

‘డీజీపీ గారూ..మీ నాయకత్వంలో పోలీస్ వ్యవస్థ మసక బారుతోంది’

అమరావతి:  టీడీపీ నేత కళా వెంకట్రావ్ అరెస్ట్‌పై టీడీపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ విషయంలో డీజీపీ, పోలీసుల తీరుపై టీడీపీ నేత వర్ల రామయ్య ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. ‘‘డీజీపీ సవాంగ్ గారూ! ఎంతో మంచి పేరున్న మన రాష్ట్ర పోలీసు వ్యవస్థ ప్రాభవం, మీ నాయకత్వంలో మసక బారుతుంది. సింహావలోకనం చేసుకోండి. లేకపోతే స్టేషన్ బెయిల్ ఇచ్చే కేసులో, రాత్రి మాజీ హోం మంత్రి కళా వెంకట్రావును అరెస్ట్ చేసి, పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లిన తీరు, మీ నాయకత్వానికి తీరని మచ్చ’’ అంటూ వర్ల రామయ్య ట్వీట్ చేశారు.



Updated Date - 2021-01-21T16:52:33+05:30 IST