అమరావతి: చంద్రబాబు సతీమణిపై వ్యాఖ్యల విషయంలో వంశీ చెప్పిన క్షమాపణలను నమ్మలేమని తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. ‘‘వంశీ సారీ కాదు... మాకు చంద్రబాబు కన్నీళ్లు కనిపిస్తున్నాయి’’ అని తెలిపారు. వంశీ ఇటు సారీ అంటారు...కొడాలి మళ్ళీ మీదే తప్పు అంటారని మండిపడ్డారు. వల్లభనేని 5 శాతమే తప్పు చేసారని కొడాలి అనడాన్ని ఎలా చూడాలని ప్రశ్నించారు. వైసీపీ నేతలు క్షమాపణలు చెప్పినట్లు తాము భావించడం లేదని అనిత అన్నారు.