అమరావతి: వైసీపీ పాలనలో మహిళలకు అడుగడుగునా అవమానాలే అని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ కౌరవులు మహిళలను అవమానిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. అనంతపురంలో తెలుగు మహిళా రాష్ట్ర నేతల ఇళ్లపై పోలీసుల దాడులు హేయమన్నారు. మహిళల ఇళ్లలోకి వెళ్లి సోదాలు చేయడానికి పోలీసులకు సిగ్గు అనిపించలేదా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ అరాచకాన్ని ప్రశ్నించేవారు ఉగ్రవాదుల్లా కనిపిస్తున్నారా అంటూ నిలదీశారు. చంద్రబాబు గారి భార్యపై దిగజారి మాట్లాడిన నేతలకు అదనపు భద్రత.... మహిళలను అవమానించడంపై ప్రశ్నిస్తే ఎదురుదాడులు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పాలనకు స్వస్తి పలికే రోజులు దగ్గరపడ్డాయని వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు.