ప్రభుత్వం ప్రజల ప్రాణాలను గాలికొదిలేసింది

ABN , First Publish Date - 2021-04-13T06:18:25+05:30 IST

ప్రభుత్వం ప్రజల ప్రాణాలను గాలికొదిలేసింది

ప్రభుత్వం ప్రజల ప్రాణాలను గాలికొదిలేసింది
మాట్లాడుతున్న ఉషారాణి

ఫ టీడీపీ విజయవాడ పార్లమెంట్‌ మహిళా అధ్యక్షురాలు చెన్నుపాటి ఉషారాణి 

విద్యాధరపురం, ఏప్రిల్‌ 12 : రాష్ట్ర ప్రభు త్వం మద్యంపై వచ్చే ఆదాయం గురించి ఆలోచిస్తుందే తప్ప ప్రజల ప్రాణాలను గాలి కొదిలేసిందని  టీడీపీ విజయవాడ పార్ల మెంట్‌ మహిళా అధ్యక్షురాలు చెన్నుపాటి ఉషారాణి అన్నారు. సోమవారం ఆటో నగర్‌లోని టీడీపీ జిల్లా  కార్యాలయంలో ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనాని దృష్టిలో పెట్టుకుని వైన్‌షాపులు, బార్లు తీయకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వైన్‌ షాపులు దగ్గర ప్రజలు గుమిగూడి మద్యం తీసుకోవటం వల్ల వారి కుటుంబ సభ్యులకు కూడా ప్రమాదం పొంచి ఉందన్నారు. చాలా రాష్ట్రాల్లో కరోనా సెకండ్‌ వేవ్‌ విషయంలో జాగ్రత్తలు పాటిస్తుంటే  ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి కరోనా కట్టడిపై ఆలోచించకుండా ఎన్నికల్లో ఎలా గెలవాలనే దానిపై మాత్రమే దృష్టి పెట్టారని విమర్శిం చారు. అన్ని రాష్ట్రాలు కరోనా భయంతో విద్యా సంస్థలను మూసివేస్తుంటే ఏపీలో స్కూళ్ల మూసివే యడంపై జగన్‌ ప్రభుత్వం ఆలోచించడం లేదన్నారు. రాష్ట్రంలో విద్యా సంస్థలు తెరవటం వల్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారన్నారు. రాష్ట్రంలో విద్యా సంస్థలతో పాటు మల్టిప్లెక్స్‌ లు, షాపింగ్‌ కాంప్లెక్స్‌లను కరోనా నేపథ్యం లో కట్టడి చేయాలని ఆమె కోరారు. రాష్ట్రంలో కరోనా సెకండ్‌ వేవ్‌ ఎక్కువగా ఉన్నందున ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కు ధరించి, భౌతికదూరాన్నిపాటించాలని అర్హులందరూ వ్యాక్సిన్‌ వేయించుకోవాలని సూచించారు.

 ప్రభుత్వాలకు రైతులే బుద్ధి చెప్పాలి

కంకిపాడు  : రైతులను నట్టేట ముంచిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రైతులే తగిన బుద్ధి చెప్పాలని మాజీ ఎంపీపీ దేవినేని రాజా అన్నారు.  సోమవారం ఆయన  స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఖరీఫ్‌లో సాగు చేసిన ధాన్యానికే ఇప్పటి వరకు బిల్లులు  రాక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రబీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు లేక పోవటంతో రైతులను దళారులు దోచేసుకుంటున్నారని విమర్శించారు. బస్తా ధాన్యం ధర రూ. 1150 నుంచి రూ. 900కి పడిపోయిందన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వ మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో రైతులను సమాయత్తం చేసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

Updated Date - 2021-04-13T06:18:25+05:30 IST