ముర్ముకు వైసీపీ మద్దతును ఖండిస్తున్నాం: శ్యామ్ చంద్ర శేషు

ABN , First Publish Date - 2022-06-27T03:37:14+05:30 IST

బీజేపీ (Bjp) రాష్ట్రపతి అభ్యర్థికి వైసీపీ (Ycp) ప్రభుత్వం మద్దతు ఇవ్వడాన్ని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ దాసరి శ్యామ్ చంద్ర శేషు ఖండించారు. రాష్ట్ర విభజ...

ముర్ముకు వైసీపీ మద్దతును ఖండిస్తున్నాం: శ్యామ్ చంద్ర శేషు

జంగారెడ్డిగూడెం (Eluru District): బీజేపీ (Bjp) రాష్ట్రపతి అభ్యర్థికి వైసీపీ (Ycp) ప్రభుత్వం మద్దతు ఇవ్వడాన్ని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ దాసరి శ్యామ్ చంద్ర శేషు ఖండించారు. రాష్ట్ర విభజన హామీలు, ప్రత్యేక హోదాను బీజేపీ విస్మరించిందని ఆయన వ్యాఖ్యానించారు.  ‘‘ఎన్నికల ముందు జగన్ మోహన్ రెడ్డి యువభేరీలు పెట్టి రాష్ట్రమంతా తిరిగారు. ప్రత్యేక హోదానే రాష్ట్ర అభివృద్ధికి సంజీవన్నారు. ప్రత్యేక హోదా వస్తేనే యువతకు భవిత, పరిశ్రమలు వస్తాయని చెప్పారు. రాయితీలు వస్తాయని.. ఉద్యోగాలు వస్తాయని జగన్ అన్నారు. తనను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని జగన్ హామీ ఇచ్చారు.  విభన హామీలు సాధిస్తాననంటూ గింకారాలు పోయారు. ఇప్పుడు బిజెపి రాష్ట్రపతి అభ్యర్థి గెలుపొందాలంటే వైసిపి మద్దతు తప్పనిసరి అయింది. ఈ సందర్భంలో ప్రత్యేక హోదా, రైల్వే జోన్, పోలవరం, విశాఖ స్టీల్ ప్లంట్ ప్రవేటు పరం కాకుండా సొంత ఘనులు సాధించడం వంటివి డిమాండ్ చేయాలి. ఆర్థిక కేసులలో  A1, A2 లు గా జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి ఉన్నారు. కేసుల నుంచి తప్పించుకునేందుకు యావత్తు ఏపీ భవిష్యత్తును, యువతను దారుణంగా మోసం చేశారు. బేషరుతుగా బీజేపికి మద్దతు తెలపడం అత్యంత దారుణం.’’ అని శేషు పేర్కొన్నారు.


‘‘వీరికి నిజంగా ప్రజల పట్లచిత్తశుద్ధి ఉంటే వెంటనే వారు మద్దతు ఉపసంహరించుకోవాలి. లేదా రాజీనామా చేయాలి. మిథున్ రెడ్డి చింతలపూడి వైసీపీ ప్లీనరీలో మాట్లాడుతూ రాష్టప్రతి అభ్యర్థికి గత ప్రభుత్వాలు ఏవిధంగా చేశారో గుర్తు తెచ్చుకోవాలని అనడం అతని దిగజారుడు తనానికి నిదర్శనం.  నారాయణ్, అబ్దుల్ కలామ్ రాష్ట్రపతులు కావడానికి ముఖ్యభూమిక పోషించింది తెలుగుదేశం పార్టీ.  పోలవరం కోసం కేంద్రంలో మొదటి క్యాబినెట్లోనే ముంపు మండలాలను విలీనం చేసేలా ధైర్యంగా పోరాడింది తెలుగుదేశం. అవినీతి కేసుల కోసం మెడలు వంచుకుని కేంద్ర పెద్దల కాళ్ళు పట్టుకోలేదు.’’ అని శేషు ఎద్దేవా చేశారు. 


ఇప్పటికైనా చేసిన తప్పు ఒప్పుకుని  రాష్ట్ర యువతకు క్షమాపణ చెప్పాలి. లేదంటే భవిష్యత్తులో వైసీపీ పరిస్థితి అధోగతే.’’ అని శేషు జోస్యం చెప్పారు.


Updated Date - 2022-06-27T03:37:14+05:30 IST