Abn logo
Nov 25 2021 @ 16:22PM

భయపడే ప్రసక్తే లేదు: టీడీపీ నేత స్వప్న

అనంతపురం: పోలీసుల బెదిరింపులకు తాను భయపడే ప్రసక్తే లేదని టీడీపీ నేత తెలుగు మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్వప్నఅన్నారు. స్వప్న నివాసంలో ఉదయం 7.30 గంటల నుంచి పోలీసులు తనిఖీలు నిర్వహించారు. నగదు, బంగారం, ఆస్తుల గురించి పోలీసులు ఆరా తీశారని ఆమె పేర్కొన్నారు. ల్యాప్‌టాప్‌, ఇతర వస్తువులను పోలీసులు పరిశీలించారన్నారు. తనను భయబ్రాంతులకు గురి చేసేందుకే ఇలాంటి సోదాలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. తెలుగు మహిళ రాష్ట్ర నేతలు స్వప్న, విజయ శ్రీ ఇళ్లపై పోలీసులు దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. అధికార పార్టీ తీరును ప్రశ్నిస్తున్న వారిపై వైసీపీ నేతలు ప్రతీకారం తీర్చుకుంటున్నారు. ప్రశ్నించే వారిని టార్గెట్‌గా చేసుకుని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. తాజాగా అనంతపురంలో తెలుగు మహిళ రాష్ట్ర నేతలు స్వప్న, విజయ శ్రీ ఇళ్ళలోకి వెళ్లి బంగారం నగలతో పాటు ఇతర వస్తువులను పోలీసులు సీజ్ చేశారు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ మీడియాను కూడా అనుమతించడం లేదు. ఈ నేపథ్యంలోనే పోలీసులకు, తెలుగు మహిళా నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. తెలుగు మహిళ రాష్ట్ర నాయకురాలు తేజస్వినికి చెందిన డ్రైవింగ్ స్కూల్ కార్లను పోలీసులు సీజ్ చేశారు. అయితే పోలీసుల తీరుపై టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మహిళా నేతలకు జిల్లా టీడీపీ నేతలు అండగా నిలుస్తున్నారు.