వైసీపీ ప్రభుత్వ చర్యలతో డ్వాక్రా భవిష్యత్తు అంధకారం

ABN , First Publish Date - 2021-12-03T03:45:36+05:30 IST

వైసీపీ ప్రభుత్వ చర్యలతో డ్వాక్రా భవిష్యత్‌ అంధకారంలోకి నెట్టడంతో పొదుపు ఉనికే ప్రశ్నార్థకంగా తయారైందని తెలుగు మహిళ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గుంటుపల్లి శ్రీదేవి చౌదరి పేర్కొన్నారు.

వైసీపీ ప్రభుత్వ చర్యలతో డ్వాక్రా భవిష్యత్తు అంధకారం
మాట్లాడుతున్న తెలుగుమహిళ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శ్రీదేవి చౌదరి

కావలి, డిసెంబరు 2: వైసీపీ ప్రభుత్వ చర్యలతో డ్వాక్రా భవిష్యత్‌ అంధకారంలోకి నెట్టడంతో పొదుపు ఉనికే ప్రశ్నార్థకంగా తయారైందని తెలుగు మహిళ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గుంటుపల్లి శ్రీదేవి చౌదరి పేర్కొన్నారు. కావలి టీడీపీ కార్యాలయంలో గురువారం పొదుపు మహిళలతో కలిసి ఆమె విలేకరులతో మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వాతంత్య్రం, స్వేచ్ఛ కోసం 1995లో టీడీపీ ప్రభుత్వంలో డ్వాక్రా గ్రూపులు స్థాపించారన్నారు. వాటి ద్వారా స్వయం ఉపాధి పొందుతూ కుటుంబాలకు అండగా ఉంటున్న డ్వాక్రా వ్యవస్థను సీఎం జగన్మోహన్‌ రెడ్డి ధనదాహంతో కూకటి వేళ్లతో సహా పెకిలించి పొదుపు ఉనికినే ప్రశ్నార్థకంగా తయారు చేశారన్నారు. అభయహస్తం పథకంతో వృద్ధాప్యంలో పింఛన్‌ కోసం రూపాయి రూపాయి కూడబెట్టుకున్న రూ.2,118 కోట్లను వైసీపీ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ధన దాహంతో కాజేయటం దుర్మార్గపు చర్య అన్నారు. ఈ సమావేశంలో మైనంపాటి మంజుల వాణి, నల్లపునేని సుహాసిని, అల్లూరు సరోజిని, గోళ్ల లలిత, భానుమతి, మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-12-03T03:45:36+05:30 IST