రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రపంచానికే ఆదర్శప్రాయులు: సోమిరెడ్డి

ABN , First Publish Date - 2020-08-12T15:11:55+05:30 IST

ప్రపంచాన్ని కుదిపేస్తున్న కోవిడ్‌కు వ్యాక్సీన్ తయారీలో ముందు నిలిచిన రష్యాకు టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి

రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రపంచానికే ఆదర్శప్రాయులు: సోమిరెడ్డి

అమరావతి: ప్రపంచాన్ని కుదిపేస్తున్న కోవిడ్‌కు వ్యాక్సిన్ తయారీలో ముందు నిలిచిన రష్యాకు టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అభినందనలు తెలియజేశారు. వ్యాక్సిన్ భద్రతను తన బిడ్డపైనే పరీక్షించిన ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ అంకితభావం చిరస్మరణీయమని కొనియాడారు. కన్న బిడ్డ కన్నా దేశ ప్రజల క్షేమమే ముఖ్యమని భావించిన పుతిన్ ప్రపంచానికే ఆదర్శప్రాయులయ్యారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. 

Updated Date - 2020-08-12T15:11:55+05:30 IST