Advertisement
Advertisement
Abn logo
Advertisement

అధికారుల నిర్లక్ష్యంతోనే ఇలాంటి పరిస్థితులు: సోమిరెడ్డి

నెల్లూరు: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జిల్లాలోని ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని టీడీపీ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. జిల్లాలో అపార నష్టం జరిగిందన్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే జిల్లాలో ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయని ఆయన ఆరోపించారు. నెల్లూరు ఇసుక మాఫియా కరకట్టలు ధ్వంసం చేయడం వల్ల వరద ఊర్లపై వరద ఒక్కసారిగా రావడంతో అనేక గ్రామాలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యాయన్నారు. ప్రతి కుటుంబానికి కడపలో 5,800 ఇచ్చినట్టుగా నెల్లూరులో కూడా వరద బాధితులకు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎం సొంత జిల్లాలోనే 38 మంది వరద నీటికి కొట్టుకొని పోతే ఇంతవరకు జగన్, మంత్రులు వెళ్ళకపోవడం బాధాకరమన్నారు. 


Advertisement
Advertisement