పార్వతీపురం మన్యం : మాజీ శాసనసభ్యుడు, టీడీపీ నేత శత్రుచర్ల చంద్రశేఖరరాజు(72) కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా మూత్రపిండాల వ్యాధితో విశాఖలో చికిత్స పొందుతున్న చంద్రశేఖరరాజు ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. శత్రుచర్ల ఇకలేరని తెలుసుకున్న అభిమానులు, కార్యకర్తలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. టీడీపీ నేత భౌతికకాయాన్ని కుటుంబసభ్యులు ఆస్పత్రి నుంచి కురుపాం మండలంలోని చినమేరంగి కోటకు తరలించనున్నారు. మాజీ ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణికి చంద్రశేఖరరాజు స్వయాన మామ అవ్వగా.. టీడీపీ నేత శత్రుచర్ల విజయరామరాజుకు సోదరుడు. చంద్రశేఖరరావు మృతిపట్ల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పలువురు తెలుగు తమ్ముళ్లు, వైసీపీ నేతలు, కార్యకర్తలు సంతాపం ప్రకటించారు.
ఇవి కూడా చదవండి