విజయవాడ: టీడీపీ నేత పట్టాభి తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్‌లోనే ఉన్నారు. పట్టాభిని గత రాత్రి విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ రోజు కోర్టులో హాజరుపరచనున్నారు. మరోవైపు పట్టాభి అరెస్ట్ నేపథ్యంలో తోట్ల వల్లూరు పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు. ఊళ్ళోకి వెళ్లే రోడ్లను కూడా మూసివేశారు. స్థానికులకు తప్ప ఇతరులకు గ్రామంలోకి ప్రవేశం లేదని పోలీసులు తేల్చిచెప్పారు. తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్ రోడ్డులో పచ్చగడ్డి మోపులతో వెళ్తున్న రైతులను పోలీసులు ఇబ్బందులకు గురిచేస్తున్నారు.