రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం..

ABN , First Publish Date - 2021-03-02T06:41:12+05:30 IST

రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోందని, నిరంతరం కక్ష పూరిత వాతావరణం సృష్టిస్తున్నారని కాకినాడ పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌ ధ్వజమెత్తారు.

రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం..
కొవ్వొత్తుల ర్యాలీ..

కాకినాడ పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షుడు నవీన్‌ 

డెయిరీఫారమ్‌ సెంటర్‌ (కాకినాడ), మార్చి1: రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోందని, నిరంతరం కక్ష పూరిత వాతావరణం సృష్టిస్తున్నారని కాకినాడ పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌ ధ్వజమెత్తారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుపతి సంఘటన చాలా దురదృష్టకరమన్నారు. ప్రతిపక్షాలను, సామాన్య ప్రజలను భయబ్రాంతులకు గురి చేసి పాలన సాగిస్తున్నారన్నారు. సొంత గ్రామంలో కూడా తిరగడానికి వీలు లేకుండా చేస్తున్నారన్నారు. మున్సిపల్‌ ఎన్నికలకు భయపడే రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తోందన్నారు. ఎన్నికల వరకే రాజకీయంగా చూడాలని, వైసీపీ ప్రభుత్వం నిరంతరం ఎన్నికల ప్రక్రియలా భావిస్తుందన్నారు. దివీస్‌ పరిశ్రమ వ్యవహారాన్ని పక్కదోవ పట్టించేందుకే సెజ్‌ భూములు వెనక్కి ఇచ్చే నిర్ణయం తీసుకున్నారన్నారు.  

కొవ్వొత్తుల ర్యాలీ..

 టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు అడ్డుకున్నందుకు నిరసనగా సోమవారం సాయంత్రం కాకినాడ నగరంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. బాలాజీ చెరువు సెంటర్‌ నుంచి ఇంద్రపాలెం వంతెన వద్ద గల అంబేడ్కర్‌ విగ్రహం వరకు ఈ ర్యాలీ జరిగింది. ర్యాలీలో కాకినాడ పార్లమెటరీ టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌, కాకినాడ పార్లమెంటరీ తెలుగు మహిళాధ్యక్షురాలు సుంకర పావని, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-02T06:41:12+05:30 IST