అమరావతి: జగన్ రెడ్డి(Jagan reddy)కి ఇచ్చిన ఒక్క ఛాన్స్‌తో జనం బతకడానికి ఛాన్స్ లేకుండా పోయిందని టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి లోకేష్(Lokesh) అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... బైక్ యాక్సిడెంట్లో గాయపడిన లెక్చరర్ రామకృష్ణ నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేరడమే శాపమా? అని ప్రశ్నించారు. డ్యూటీ డాక్టర్ వుండి కూడా స్వీపర్, సెక్యూరిటీ గార్డుతో చికిత్స చేసి ప్రాణంతో చెలగాటమాడటం దారుణమని మండిపడ్డారు. జగన్ రెడ్డి ప్రచారమేమో ప్రజారోగ్య దేవుడు.. వాస్తవమేమో ప్రజల పాలిట యముడు అంటూ వ్యాఖ్యలు చేశారు. కక్షసాధింపుల్లో జగన్ ప్రభుత్వం ఉంటే, వ్యవస్థలన్నీ నిర్వీర్యమై జనం ప్రాణాలు గాలిలో కలిసి పోతున్నాయన్నారు. లెక్చరర్ రామకృష్ణది ప్రభుత్వ హత్యే అని అన్నారు. రోజురోజుకీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిస్థితులు దిగజారుతున్నా వైసీపీ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడడం లేదని లోకేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఇవి కూడా చదవండి