Abn logo
Jun 21 2021 @ 11:45AM

సొంత చెల్లెళ్లకే న్యాయం చేయలేనోడు అన్న కాదు దున్న: లోకేష్

అమరావతి: రాజధానిలో యువతిపై జరిగిన సామూహిక అత్యాచారంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. ‘‘జనం తిరగబడతారనే భయంతో  రెండేళ్లుగా తాడేపల్లి ప్యాలెస్‌లో హోం ఐసోలేషన్ అయిన సీఎం జగన్ రెడ్డి గారూ! మీ  ప్యాలెస్‌కి కూతవేటు దూరంలో ఒక యువతిని దుండగులు అత్యంత దారుణంగా అత్యాచారం చేశారనే సమాచారమైనా మీకు తెలుసా?’’ అని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టే పోలీసులు ఓ అమ్మాయికి ఇంత అన్యాయం జరిగితే ఏమయ్యారని నిలదీశారు.


సొంత చెల్లెళ్లకే న్యాయం చేయలేనోడు అన్న కాదు దున్న అని వ్యాఖ్యానించారు. ఆడపిల్లకి అన్యాయం జరిగితే గన్ కంటే ముందొస్తాడు జగన్ అంటూ పంచ్ డైలాగులేశారన్నారు. ముఖ్యమంత్రి ఇంటి దగ్గర ఇంత అన్యాయం జరిగితే ఏడమ్మా జగన్? అని మండిపడ్డారు. అమరావతి ఉద్యమానికి భయపడి వేలమంది పోలీసుల్ని కాపలా పెట్టుకున్న పిరికి పంద జగన్ పాలనలో మహిళా భద్రత ప్రశ్నార్ధకమైందని లోకేష్ అన్నారు.