Abn logo
Jul 31 2021 @ 08:42AM

టీడీపీ నేతలను హౌస్ అరెస్టులు చేయడం దారుణం: నల్లమిల్లి

అమరావతి: తెలుగుదేశం పార్టీ నిజానిర్దారణ కమిటీ సభ్యులను పోలీసులు హౌస్ అరెస్టులు చేయడం దారుణమని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. కొండపల్లిలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌ను సందర్శించడం ఖాయమని, నివేదిక సమర్పించడం జరుగుతుందని స్పష్టం చేశారు. అక్కడ ఏ విధమైన అక్రమ మైనింగ్ జరగకపోతే  ప్రభుత్వం ఎందుకు నిజానిర్దారణ కమిటీని పర్యటించనివ్వడం లేదని ప్రశ్నించారు. గత సంవత్సరంలో త్రి మేన్ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం అక్కడ జరుగుతున్న అక్రమ మైనింగ్‌ను ఎందుకు నిలుపుదల చేయలేదని నిలదీశారు. అంటే తప్పు జరిగినట్లేగా అని  మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు.


కాగా...కొండపల్లి లో జరిగిన అక్రమ మైనింగ్ పరిశీలనకు తెలుగుదేశం పార్టీ నిజ నిర్థారణ కమిటీ వెళ్లనుంది. కాగా కొండపల్లి వెళ్లకుండా నిజ నిర్థారణ కమిటీ సభ్యురాలు  నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యను పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు.