బాపట్ల: డెల్టా ప్రాంతంలో మట్టి మాఫియా చెలరేగిపోతోందని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు(Nakka anandbabu) అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... గ్రామాల్లో చెరువుల్లో మట్టి అక్రమంగా తరలిస్తున్నారని మండిపడ్డారు. ఎలాంటి అనుమతులు లేకుండానే మట్టి అడ్డగోలుగా తవ్వుతున్నారని ఆరోపించారు. ఇంత జరుగుతున్నా అధికారులు, పోలీసులు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. ఎవరైనా అడ్డుకుంటే బెదిరిస్తున్నారని తెలిపారు. మంత్రి నుంచి గ్రామ స్థాయి కార్యకర్తల వరకూ వాటాలు పంచుకుంటున్నారని అన్నారు. అధికారులు మౌనంగా ఉంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని నక్కా ఆనంద బాబు హెచ్చరించారు.