Abn logo
Sep 28 2021 @ 13:54PM

వైసీపీ ప్రభుత్వంలో రైతులకు చేసింది శూన్యం: నక్కా ఆనంద్

గుంటూరు: వైసీపీ ప్రభుత్వంలో రైతులకు చేసింది శూన్యమని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. దేశంలో రైతుల ఆత్మహత్యల్లో ఏపీ  మూడో స్థానం, కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఉందని తెలిపారు. రెండున్నర ఏళ్ళలో 960  మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. రైతులను జగన్ రెడ్డి ప్రభుత్వం అన్ని విధాలుగా దగా చేస్తోందని మండిపడ్డారు. ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారన్నారు. ఆరుగాలం పండించిన రైతుకు గిట్టుబాటు ధర లేకుండా పోయిందని అన్నారు. రైతులు పంట అమ్ముకునే సమయంలో వైసీపీ దళారులు దోచుకుంటున్నారని మండిపడ్డారు. వేమూరు నియోజకవర్గంలో క్వింటాకు 300 నుంచి 400 వరకు మార్కెట్ యార్డ్‌లో దోచుకున్నారని ఆరోపించారు. రైతులకు సకాలంలో ఎరువులు కూడా  అందించే పరిస్థితి లేదని నక్కా ఆనంద్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇవి కూడా చదవండిImage Caption