Abn logo
Sep 23 2021 @ 13:01PM

ఎంగిలి కూటికి వైసీపీ కక్కుర్తి పడుతోంది: nakka

గుంటూరు: టీడీపీ వదిలేసిన ఎన్నికలలో గెలుపును జగన్ రెడ్డి గొప్పగా చెప్పుకుంటున్నారని మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు విమర్శించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ దుగ్గిరాల మండలంలో స్థానిక నేతలు ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారన్నారు. 18 స్థానాల్లో వైసీపీ ఐదు సీట్లలో మాత్రమే గెలిచిందని తెలిపారు. టీడీపీ ఎంపీపీ అభ్యర్థికి కుల ధృవీకరణ పత్రం ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ముస్లిం మహిళను నాలుగు రోజుల నుంచి తిప్పుకుంటున్నారని తెలిపారు. అధికార పార్టీ ఒత్తిడితో దుగ్గిరాల తహశీల్దార్ కాలయాపన చేస్తుందన్నారు. ఎంగిలి కూటికి వైసీపీ కక్కుర్తి పడుతోందని వ్యాఖ్యానించారు. దుగ్గిరాల మొత్తం పోలీసుల మయమైందన్నారు. టీడీపీ అభ్యర్థులు, వారి బంధువుల ఇళ్లకు వెళ్లి బెదిరిస్తున్నారని చెప్పారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే సిగ్గు మాలిన రాజకీయాలకు దిగుతున్నారని మండిపడ్డారు. తాము కోర్టుకు వెళ్తే ఈ తహశీల్దార్‌ను ఎవ్వరూ కాపాడలేరని హెచ్చరించారు. ఒక్క ఎంపీపీ సీటు కోసం ఇంత దిగజారిపోవాలా అని ప్రశ్నించారు. రాబోవు రోజుల్లో వైసీపీ వాళ్లకు బడితేపూజ తప్పదని...మరి అధికారులను ఎవరు కాపాడతారని అన్నారు. దుగ్గిరాల తహశీల్దార్‌ను ఎవ్వరూ కాపాడతారో చూస్తామని నక్కా ఆనంద్ బాబు పేర్కొన్నారు. 

ఇవి కూడా చదవండిImage Caption