Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఏపీ పోలీస్ సంఘం అధికారుల ప్రకటనను ఖండిస్తున్నాం: Nagendra

విజయవాడ: రాష్ట్ర పోలీస్ సంఘం అధికారుల ప్రకటనను ఖండిస్తున్నామని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొత్త నాగేంద్రకుమార్ అన్నారు. ప్రతిపక్ష నేతగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థపై నమ్మకంలేదు అని అన్న వ్యక్తి జగన్ రెడ్డి అని గుర్తుచేశారు. తమ పోలీస్ వ్యవస్థపై ఘాటు వ్యాఖ్యలు చేసిన న్యాయమూర్తులను కూడా ఇలానే ప్రశ్నిస్తారా అని ప్రశ్నించారు. తాడేపల్లి రాజాప్రసాదం నుండి ప్రభుత్వ సలహాదారు  సజ్జల రామకృష్ణా రెడ్డి నుండి వచ్చిన స్క్రిప్ట్ చదవటం కాదని... యదార్ధాలు గుర్తించి మాట్లాడండి అని కోరుతున్నామన్నారు. తమరు తమ వ్యక్తిత్వాలను ఉద్యోగధర్మాలను పక్కనపెట్టి ఏ వ్యక్తి కోసం పని చేస్తున్నారో.. వారి గత ప్రవర్తనను గుర్తు చేసుకొని మసలుకోవాలని కోరుతుమని నాగేంద్ర కుమార్ పేర్కొన్నారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement