‘జగన్...మరోసారి ఫేక్‌ సీఎం అనే పేరుని సార్థకం చేసుకున్నారు’

ABN , First Publish Date - 2021-06-24T18:44:58+05:30 IST

ఆఖరికి దేశ అత్యున్నత న్యాయస్థానానికి కూడా ఫేక్ అఫిడవిట్ సమర్పించి మరోసారి ఫేక్ సీఎం అనే పేరుని జగన్ రెడ్డి సార్థకం చేసుకున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ వ్యాఖ్యానించారు.

‘జగన్...మరోసారి ఫేక్‌ సీఎం అనే పేరుని సార్థకం చేసుకున్నారు’

అమరావతి: ఆఖరికి దేశ అత్యున్నత న్యాయస్థానానికి కూడా ఫేక్ అఫిడవిట్ సమర్పించి మరోసారి ఫేక్ సీఎం అనే పేరుని జగన్ రెడ్డి సార్థకం చేసుకున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ వ్యాఖ్యానించారు. పరీక్షల నిర్వహణకు సరైన ప్రణాళిక లేని అఫిడవిట్ సమర్పించి చివాట్లు తిన్నారన్నారు. తమరు ఇచ్చిన అఫిడవిట్ ప్రకారం పరీక్షల నిర్వహణకు 35 వేల క్లాస్ రూమ్స్ ఉండాలని...అన్ని రూమ్స్,సిబ్బందిని ప్రభుత్వం సిద్ధం చేసిందా? అని ప్రశ్నించారు. ప్రాణాల రక్షణకు, పరీక్షల నిర్వహణకు కనీస ఏర్పాట్లు కూడా చెయ్యకుండానే మొండి పట్టుదలతో పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఏముందని సుప్రీం కోర్టు ప్రశ్నించడం జగన్ రెడ్డి మూర్ఖత్వానికి పరాకాష్ట అని ఆయన అన్నారు.


పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడితే పోయే ఒక్కో ప్రాణానికి కోటి రూపాయిలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కోర్టు వ్యాఖ్యానించడం చూస్తే ప్రజల ప్రాణాలంటే ప్రభుత్వానికి లెక్కలేదనే విషయం బయటపడిందని తెలిపారు. ఇప్పటికైనా చేసిన తప్పుని సరిదిద్దుకొని విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రాణాలు బలితీసుకునే పరీక్షల నిర్వహణ ఆలోచనకి స్వస్తి పలకాలని హితవుపలికారు. తక్షణమే పరీక్షలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకొని సుప్రీం కోర్టుకి తెలపాలని లోకేష్ డిమాండ్ చేశారు. 


Updated Date - 2021-06-24T18:44:58+05:30 IST