అమరావతి: తెలుగు వారి ఉగాది సంవత్సరం శుభకృత్లో ప్రజలకు సర్వశుభాలు కలగజేయాలని ఆకాంక్షిస్తున్నానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలను ఆయన తెలిపారు. కొత్త సంవత్సరంలో మీరు తలపెట్టిన కార్యాలన్నీ నిర్విఘ్నంగా కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. అచ్చతెలుగు పండుగని ఇంటిల్లిపాదీ ఆనందంతో జరుపుకోవాలన్నారు.
ఇవి కూడా చదవండి