అమరావతి: ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘నిజం చెబితే తల వెయ్యి ముక్కలవుతుందనే శాపమేమైనా మీకు ఉందా జగన్ రెడ్డి గారు?.. అబద్ధాలే శ్వాసగా బ్రతికేస్తున్నారు!.. ఇదిగో మీ ఊళ్లో నాటు సారా బట్టీ. జంగారెడ్డి గూడెం లాంటి పట్టణంలో నాటు సారా కాస్తారా అని అమాయకంగా అడిగారు. ఇప్పుడు మీ సొంత ఊరు పులివెందులలోనే నాటు సారా బట్టీలు బయటపడ్డాయి. దీనికి ఏం సమాధానం చెపుతారు?’’ అంటూ ప్రశ్నించారు. ఒక్క పులివెందుల నియోజకవర్గంలోనే 2021 జనవరి నుండి ఇప్పటి వరకూ 300 కేసులు నమోదయ్యాయని తెలిపారు. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నియోజవర్గంలోనే సారా ఏరులై పారుతుంటే ఇక రాష్ట్రంలో సారా మరణాలకి అంతు లేదని లోకేష్ వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి